కొల్లాపూర్: న్యాయ శాఖ ఈ సేవా కేంద్రం ప్రారంభించిన జిల్లా జడ్జీ
కొల్లాపూర్ కోర్టులో న్యాయశాఖ ఈ సేవా కేంద్రాన్ని ఆదివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు ప్రారంభించారు. కక్షిదారుల సౌకర్యార్థం డిజిటల్ సేవలను అందించడానికి ఆన్లైన్ ద్వారా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మరియు తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే ప్రారంభించారు. ఉచిత న్యాయ సలహాలు ఎలా తీసుకోవాలనే అంశాలపై కక్షిదారులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.