నాగర్ కర్నూల్: లాంచీ ట్రయల్స్ రన్ నిర్వహిస్తున్న మంత్రి జూపల్లి
రాష్ట్రంలో టూరిజం డెవలప్మెంట్ దిశగా అడుగులు పడుతున్నాయని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శ్రీశైలం వరకు కృష్ణానదిలో ప్రయాణించే లాంచీని మంత్రి ట్రాయల్ రన్ నిర్వహించారు. రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ లో 120 కిలోమీటర్ల దూరాన్ని ఆరున్నరగంటల పాటు లాంచీలో ప్రయాణించి మధురానుభూతి పొందవచ్చన్నారు.