కారు ఢీకొని..యువకుడికి గాయాలు

532చూసినవారు
కారు ఢీకొని..యువకుడికి గాయాలు
వెల్దండ మండలంలోని పెద్దాపూర్ గ్రామ శివారులో తుంకిబండ తండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం మాడుగుల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన శ్రీకాంత్ కల్వకుర్తి నుండి ఆమనగల్లు వెళ్తుండగా.. హైదరాబాద్ నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్