ఇందిరమ్మ రాజ్యమే లక్ష్యంగా నమ్మి
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామని కాంసానిపల్లి గ్రామ సర్పంచ్ కర్నె లక్ష్మీనారాయణ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం 8 గంటలకు కాంసానిపల్లి గ్రామానికి నల్లమల ముద్దుబిడ్డ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ విచ్చేయుచున్నారని తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారన్నారు.