మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ జనార్దన్ గౌడ్ గా పనిచేస్తున్నారు. ఉత్తమ సేవలకు గాను ఆయన ఈ నెల 15వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అవార్డు అందుకున్నారు. అందుకు గాను భారతీయ జనతా పార్టీ మండల నాయకుల మహ్మదాబాద్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మండల బిజెపి నాయకులు కుర్వ కృష్ణ, గూళ్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.