మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి మహబూబ్ నగర్ మాజీ ఎంపి స్వర్గీయ మల్లికార్జున్ ఎంతో కృషి చేశారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం అన్నారు. మల్లికార్జున్ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని పద్మావతి కాలనీలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆయన రైల్వే శాఖ సహాయ మంత్రి గా మన మహబూబ్ నగర్ ను అన్నివిధాలా అభివృద్ధి చేశారని వారి సేవలను కొనియాడారు.