రాష్ట్రంలో ఉన్న వికలాంగులకు అండగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. దీంతో నారాయణపేట జిల్లా మక్తల్ లోని క్యాంపు కార్యాలయంలో గురువారం మక్తల్ కు చెందిన స్వాతి, పాతర్ చేడ్ గ్రామానికి చెందిన వెంకటమ్మ ఇద్దరు వికలాంగులకు స్కూటీ ద్విచక్ర వాహనాలను ఎమ్మెల్యే అందజేశారు. అదేవిధంగా మాగనూర్ మహాదేవమ్మా, అనుకొండ కురువ నరసమ్మ, మక్తల్ నర్శిములుకు తల 50 వేల చెక్కును అందజేశారు.