రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాల నరసింహ డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ లోని ప్రభుత్వ అతిథి గృహంలో శుక్రవారం సీపిఐ పార్టీ నిర్మాణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ధరణి సమస్యతో రేషన్ కార్డులను గత ప్రభుత్వం ఇవ్వలేదనీ రైతులను ఇబ్బందులు పెట్టకుండా కుటుంబంలోని అందరికీ రుణమాఫీ చేయాలన్నారు.