మక్తల్ పట్టణ శివారులో శనివారం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నట్లు ఎస్సై ఆచారి తెలిపారు. గురునాథ్ అనే వ్యక్తి వద్ద రూ. 13, 280, గురుస్వామి నుండి రూ. 7, 175, నరసింహ వద్ద రూ. 7, 585 విలువ గల గుట్కా ప్యాకెట్లను సీజ్ చేశామని అన్నారు. మొత్తం రూ. 28, 040 గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నట్లు చెప్పారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.