వెల్డండ మండలం పరిదిలో బొల్లంపల్లి గ్రామానికి చెందిన పోలే జంగయ్య ఇటీవల ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, జంగయ్య నివాసానికి వెళ్లి పరామర్శించి 5,000 ఆర్థిక సహాయం అందించారు. ఎమ్మెల్యే వెంటే వెల్దండ మాజీ సర్పంచ్ భూపతి రెడ్డి, జక్కుల జంగయ్య, వెంకట్ రెడ్డి, మండల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.