పాత బంగారు నగలను ఇలా కొత్తవాటిలా మార్చేయండి

57చూసినవారు
పాత బంగారు నగలను ఇలా కొత్తవాటిలా మార్చేయండి
బంగారు నగలు ఎక్కువగా పాతవి అయ్యే కొద్ది వాటిపై కాస్త నలుపుదనం వస్తుంది. నగలను కొత్త వాటిలా మార్చడానికి.. ముందుగా గోరు వెచ్చని నీటిని తీసుకొని అందులో కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ కలపాలి. నగలను అందులో ఓ పది నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత బ్రష్‌తో శుభ్రం చేస్తే చాలు. అలాగే కొద్ది పరిమాణంలో టూత్ పేస్ట్‌ను ఓ గ్లాసు నీళ్లలో వేసి బాగా కలపండి. ఇందులో నగలను ఓ పది నిమిషాలు ఉంచి.. బ్రష్‌తో క్లీన్ చేస్తే నగలు కొత్తగా కనిపిస్తాయి.

సంబంధిత పోస్ట్