చారకొండ మండలంలోని శిరసనగండ్లలో అపర భద్రాధిగా పేరుగాంచిన సీతారామచంద్రస్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవంలో భాగంగా సోమవారం ఆలయాన్ని త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి దర్శించుకున్నారు. సోమవారం ఆలయ చైర్మన్ రామశర్మతో పాటు అర్చకులు, పూర్వకుంభంతో స్వామివారికి ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.