బిజినపల్లి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సుమతి శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో పుట్టి ప్రపంచమంతా ప్రఖ్యాతి పొందిన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ అని ఆమె అన్నారు.