నాగర్ కర్నూల్ జిల్లా ఎల్లికట్ట గ్రామం నుండి రాత్రి 12 గంటల తర్వాత సుమారు 10 ట్రాక్టర్లతో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని ఎవరైనా ఈ సమాచారం అధికారులకు ఇస్తే అక్రమ ఇసుక దందా నడిపే వ్యక్తులు అట్టి వారి ఇంటికి వెళ్లి దాడులు చేయటంతో గ్రామస్తులు మీడియా మిత్రులకు సమాచారం ఇవ్వడం జరిగింది. మీడియా మిత్రులు 100 డయల్ చేసి సమాచారం ఇవ్వగా స్పందించిన కానిస్టేబుల్ లాల్ సింగ్, నరేష్ అక్రమ ఇసుక రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లను ఎల్లికట్ట గ్రామంలో పట్టుకొని కల్వకుర్తి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. పట్టుకున్న మూడు అక్రమ ఇసుక ట్రాక్టర్ల పై కేసు నమోదు చేస్తామనీ కల్వకుర్తి ఎస్ఐ రమేష్ మీడియా మిత్రులకు తెలియజేశారు.