ఆటో కార్మికులను ఆదుకోవాలని నిరసన

57చూసినవారు
ఆటో కార్మికులను ఆదుకోవాలని నిరసన
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లో శనివారం మధ్యాహ్నం అంబేద్కర్ చౌరస్తాలో ఏఐటియూసి ఆధ్వర్యంలో ఆటో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మారేడు శివ శంకర్ మాట్లాడుతూ ఆటో కార్మికుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని వారి సమస్యలు తీర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్స్ ఎం. డి రజాక్, రాజు, నాగేంద్ర గౌడ్, రాజు, శివ, రామచందర్, కురుమయ్య, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్