రామాయణ సృష్టికర్త వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెంట్లవెళ్లి మండలం కొండూరులో గ్రామ మాజీ సర్పంచ్ నల్లపోతుల గోపాల్ ఆహ్వానం మేరకు గ్రామంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ నాయకులు పగిడాల శ్రీనివాస్ పాల్గొనీ వాల్మీకి మహర్షి నీ దర్శించుకున్నారు. కొండూరు గ్రామస్తులు మంత్రినీ శాలువాతో సన్మానించారు.