గుండెపోటుకు గురైన వ్యక్తికి సీపీర్ చేయడం ద్వారా ప్రాణాలు కాపాడే అవకాశాలు వుంటాయని ఎస్పీ యోగేష్ గౌతమ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదివారం నారాయణపేట ఎస్పీ కాన్ఫరెన్స్ హాలులో లైఫ్ సేవర్ అసోసియేషన్ డిల్లీ వైద్య నిపుణుల బృందం వారు పోలీసులకు సీపీర్ ఎలా చేయాలి అనే విషయాలపై శిక్షణ కల్పించారు. వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు వెంటనే సీపీర్ చేయాలని తద్వారా ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు.