మరికల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా వైద్య శాఖ అధికారి సౌభాగ్య లక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. హాజరు పట్టికను, ఓపి రిజిస్టర్ తనిఖీ చేశారు. నెలలో జరిగిన ప్రసవాల సంఖ్యను అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో వుండాలని ఆదేశించారు.