నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల పనులను పరిశీలించారు. కోస్గి మున్సిపల్ లో మున్సిపల్ కార్యాలయం, స్మశాన వాటిక, వెజిటబుల్ మార్కెట్, సీసీ రోడ్లు, డ్రైన్ లను పరిశీలించి ప్యాక్స్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎమ్మేల్యే మాట్లాడుతు నెల రోజులలో కూరగాయలు మార్కెట్, మున్సిపల్, పనులు శరవేగంగా పూర్తి చేయాలని మున్సిపల్ డీఈ, ఎస్ఈ మరియు మిషన్ భగీరథ డీఈ, ఎఈ లను కాంట్రక్టర్లు, అధికారులకు ఆదేశించారు.
అలాగే డ్రైన్, సీసీ రొడ్లు 15 రోజులలో ప్రతి వార్డ్ లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని తెలిపారు. అలాగే కోస్గి లో హాస్పిటల్ పనులను శరవేగంగా పూర్తి చేయాలని అలాగే తదితర అంశాలపై సమస్యలపై మాట్లాడి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మేల్యే పట్నం నరేందర్ రెడ్డి, నాయకులు, మున్సిపల్ డీఈ, ఎస్ఈ మరియు మిషన్ భగీరథ డీఈ, ఎఈ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.