నారాయణపేట పట్టణంలో రేపు 3 గంటల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ మహమ్మద్ రఫీ తెలిపారు. విద్యుత్ ఉప కేంద్రంలోని 11 కెవి ఫిడర్ మరమ్మతుల కారణంగా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు విద్యుత్ సరఫ నిలిపివేస్తున్నట్లు చెప్పారు. పాత బస్టాండ్, ఆర్డిఓ ఆఫీస్, జిల్లా ఆస్పత్రి, పళ్ళ వీధి, కూరగాయల మార్కెట్, మహంకాళి వీధి, శాతవాహన కాలనీ, సత్యనారాయణ గుడి రోడ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వుండదన్నారు.