విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

451చూసినవారు
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
నారాయణపేట మండలం, సింగారం గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. స్వపరిపాలనలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు చక్కగా పాఠాలు బోధించి ఆకట్టుకున్నారు. డిఈఓగా నవనీత, యంఈఓగా రాకేష్, ప్రధానోపాధ్యాయురాలిగా మనీషా, పిఈటిగా ధానియాల్, జయశంకర్, అటెండర్ గా శివశంకర్ గౌడ్ వ్యవహరించి అందరిచేత ప్రశంసలు అందుకున్నారు. ప్రతిభ కనపరచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. అలాగే 2022- 2023 సంవత్సరపు ఉత్తమ విద్యార్థీనిగా జోగిని మనీషాను ఎంపిక చేసి బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు శ్రీనాథ్, నర్సిములు, రుక్మన్, రాజు వెంకటయ్య, స్వామి, జహంగీర్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్