Jan 22, 2025, 11:01 IST/నారాయణ్ పేట్
నారాయణ్ పేట్
కోయిలకొండ: నూతన మండలాలు ఏర్పాటు చేయాలని వినతి
Jan 22, 2025, 11:01 IST
కోయిలకొండ మండలంలోని గార్లపాడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు వచ్చిన ఎంపీ డీకే అరుణను గార్లపాడు, కోటకొండ మండల సాధన సమితి జేఎసీ నాయకులు కలిసి తమ గ్రామాలను నూతన మండలాలుగా ఏర్పాటు చేయాలని బుధవారం వినతి పత్రం అందించారు. అన్ని అర్హతలు ఉన్న గ్రామాలను మండలాలుగా చేయాలని కోరారు. అధికారులతో మాట్లాడి మండలాల ఏర్పాటుకు కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎంపి హామీ ఇచ్చారు.