వనపర్తి జిల్లా ప్రజలను గత మూడు రోజుల నుంచి చలిగాలులు వణికిస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే చలి తీవ్రత పెరిగిందని, పనులపై బయటకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. దీనికి తోడుగా వణికిస్తున్న చలిగాలికి తోడు ముసురు వర్షం పడుతుందని అన్నారు. వృద్ధులు, ఆస్తమా రోగులు ఇబ్బంది పడుతున్నారని, కాగా చలిగాలి తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.