పీడిత ప్రజల గొంతుక మారి నినదించిన మహోన్నత వ్యక్తి దాశరథి అని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం దాశరథి కృష్ణమాచార్యుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దాశరథి చిత్ర పటానికి పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ "నా తెలంగాణ కోటి రతనాల వీణ" అని చాటి చెప్పిన మహాకవి దాశరథి అని అన్నారు.