వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలో సుప్రసిద్ధమైన శైవక్షేత్రం శ్రీకోటిలింగేశ్వర దత్తదేవస్థానములో శుక్రవారం శ్రావణమాసం ఏకాదశి సందర్భంగా దేవాలయలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని మహామృత్యుంజయ లింగం, ద్వాదశ జ్యోతిర్లింగాలకు, శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారికి పంచామృతాలతో భస్మ, గంధ, కుంకుమ జలాలతో రుద్రాభిషేకం చేసి ధూపదీప, నైవేద్యాలతో మహా మంగళహారతి సమర్పించారు.