పెబ్బేరు: భారీ మొసలి కలకలం

62చూసినవారు
పెబ్బేరు: భారీ మొసలి కలకలం
పెబ్బేరు మండలం అయ్యవారిపల్లి గ్రామంలో బుధవారం భారీ మొసలిని పట్టుకున్నారు. బీచుపల్లి కుటుంబ సభ్యురాలు కవిత తమ ఇంటి ఆవరణలో చెట్లపొదల్లో భారీ మొసలిని చూసింది. ఆమె కేకలు వేయడంతో స్థానికులు సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకులు కృష్ణ సాగర్‌కు సమాచారం ఇచ్చారు. 11 ఫీట్ల పొడవు 230 కేజీల బరువు గల భారీ మొసలిని గుర్తించి తాళ్లతో కట్టి బంధించారు. ముసలి బారిన ఎవరూ పడకుండా ఏఎస్సై వెంకటేశ్వర్ ప్రజలను అప్రమత్తం చేశారు.

సంబంధిత పోస్ట్