జోగుళాంబ గద్వాల్ జిల్లా సరిహద్దులో బీచుపల్లి కృష్ణ నది అవతలి వైపు రంగాపూర్ శివారులోని ఒక గోదాంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా పోలీస్ లకు నమ్మదగిన సమచారం వచ్చినది. జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచ్ సీఐ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటిక్యాల ఎస్సై వెంకటేష్, సిబ్బంది, వనపర్తి పోలీసులు సంయుక్తంగా పేకాట స్థావరం పై దాడి నిర్వహించి 15 మందిని అరెస్టు చేసి 6, 35, 600/- రూపాయల నగదు, 4 కార్లు, 4బైక్ లు, 15 మొబైల్స్ ఫోన్ లు స్వాధీనం చేసుకొని పెబ్బేరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించడం జరిగింది.