వ్యాధులు ప్రబలకుండా చూడండి: కలెక్టర్

68చూసినవారు
వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం జయన్న తిర్మలాపూర్ లో శుక్రవారం డ్రైడే కార్యక్రమాలను కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. గ్రామంలో గత నెల డెంగ్యూ కేసు నమోదు కాగా, ఆ ఇంటిని ఆయన సందర్శించి వారితో మాట్లాడి ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిలువ ఉన్న నీటిలో డెంగ్యూకు కారణమయ్యే దోమలు గుడ్లు పెడతాయని, ఎక్కడ నిలువ నీరు వర్షపు నీరు ఉండకుండా చూడాలన్నారు. చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్