స్వాతంత్ర సంపూర్ణ ఫలాలు అట్టడుగు స్థాయి ప్రజలకు అందినప్పుడే నిజమైన స్వాతంత్య్రం సిద్ధించినట్లు అని, అదీ తెలంగాణ రాష్ట్ర నవ నిర్మాణ, ప్రదాత కేసీఆర్ కే సాధ్యమని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో 5, 6 తరాలకు సంబంధించిన మహనీయులు ఎందరో త్యాగాలు, బలిదానాలు, జీవితాలు అర్పించారన్నారు.