నాగసానిపల్లిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

62చూసినవారు
నాగసానిపల్లిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
శ్రీరంగాపురం మండలం నాగసానిపల్లి గ్రామంలో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను చైర్మన్, గ్రామ యువకులు మంగళవారం ఘనంగా సన్మానించారు. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, శ్రీనివాస్, వెంకటేష్, రాధా, సుధాకర్, వెంకటేశ్వర్లను యువత ఘనంగా శాలువాలతో సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్