వనపర్తి జిల్లాలో ఆత్మకూరు నుంచి మదనపూర్ వెళ్లే వాహనాలు నాలుగో రోజు కూడా నిలిపోయాయి. దీంతో ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరళా సాగర్ జలాశయం నుంచి వచ్చే వరద నీటితో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. లోలెవెల్ వంతెనపై రెండు ఫీట్ల మీద నీరు పారుతుంది. వరద ప్రవాహానికి వంతెనపై ఉన్న రోడ్డుకు అక్కడక్కడ గుంతలు ఏర్పడ్డాయి. ఇరువైపులా ఉన్న రైలింగ్ ఊడిపోయింది.