వనపర్తి: శిక్షల శాతం పెరిగేలా పని చేయాలి

67చూసినవారు
కోర్టు కేసులలో శిక్షల శాతాన్ని పెంచేలా కోర్టు డ్యూటీ అధికారులు సమర్థవంతంగా పని చేయాలని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. శనివారం వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్ళతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. కోర్టు కేసులలో శిక్షల శాతాన్ని పెంచడం, తప్పు చేసిన నిందితులకు శిక్ష పడేలా చేయడం ద్వారా ప్రజలకు పోలీస్ శాఖపై మరింత గౌరవం, నమ్మకం పెరుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్