జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దేవ గురువు బృహస్పతి మేష రాశిలో సంచరిస్తున్నాడు. మే 17న చంద్రుడు కూడా అదే రాశిలోకి సంచారం చేయబోతున్నాడని పండితులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో మేష రాశి వారికి పెండింగ్ పనులు పూర్తవుతాయి. మిథున రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభం ఉంటుందంటున్నారు. వ్యాపారులు భారీ లాభాలు ఆర్జిస్తారు. తుల రాశి వారు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందంటున్నారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది.