స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురష్కరించుకొని పోలీసు, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీసు పతకాలను కేంద్ర హోంశాఖ బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1037 మందికి గ్యాలంట్రీ/సర్వీసు పతకాలను అందజేయనుంది. ఈ మేరకు అవార్డుల జాబితాను విడుదల చేసింది. గ్యాలంట్రీలో 213 మెడల్స్, పీఎంజీలో 1 మెడల్, 94 మందికి పీఎస్‌ఎం మెడల్స్, 729 మందికి ఎంఎస్‌ఎం మెడల్స్ ప్రకటించింది.