AP: గ్రామ, వార్డు సచివాలయాల్లో భారీ మార్పులకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 14 వేలకు పైగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజిస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు. 'గత ప్రభుత్వం వాటిలో 11 మంది చొప్పున సిబ్బందిని కేటాయించింది. ఇకపై 3,500 పైగా జనాభా పరిధి ఉన్న సచివాలయంలో 8 మంది, 2,500 పైగా ఉన్న చోట ఏడుగురిని, మిగతా వాటిలో ఆరుగురు సిబ్బందిని ఉంచుతాం. గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీ, పట్టణాల్లో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ హెడ్‌గా ఉంటారు' అని పేర్కొన్నారు.