ఓ గుడిలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ గంగిరెద్దు ఓ వ్యక్తిపై దాడికి దిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే గంగిరెద్దు అతడిపై ఎందుకు దాడికి దిగిందో తెలియరాలేదు. ఆ వ్యక్తి కింద పడుకోగా పొడవడానికి చాలా ప్రయత్నించింది. అతడు ఎద్దు కాళ్లు పట్టుకుని పొడవవద్దంటూ బతిమాలాడు. లేచి నిలబడి ఎద్దుకు దండం పెట్టాడు. చివరికి ఎద్దు అతడిని వదిలేసింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.