టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ?

67చూసినవారు
టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ?
గౌతమ్ గంభీర్‌ని టీమిండియా ప్రధాన కోచ్‌గా నియమించేందుకు బీసీసీఐ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. దీనిపై బోర్డు అధికారులు ఇప్పటికే తనను సంప్రదించారని ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్‌ఫో తెలిపింది. ప్రస్తుతం గంభీర్ ఐపీఎల్‌లో కేకేఆర్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో టోర్నీ ముగిసిన తర్వాత కోచ్ పదవి కోసం బీసీసీఐ అతడితో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కోచ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈ నెల 27తో ముగియనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్