త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు

76చూసినవారు
త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు
యాపిల్‌ తన ఐఫోన్‌, ఐప్యాడ్‌లలో కొత్త యాక్సెసిబిలిటీ ఫీచర్లను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. వికలాంగులు కూడా సులభంగా యాపిల్‌ డివైజ్‌లను యాక్సెస్‌ చేసేందుకు ఇవి ఉపయోగపడనున్నాయని పేర్కొంది. ఐట్రాకింగ్‌, మ్యూజిక్‌ హాప్టిక్స్‌, వోకల్‌ షార్ట్‌కట్‌లు ఈ ఏడాది చివరికి అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. ఐ ట్రాకింగ్‌ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సాయంతో పనిచేస్తుంది. వినియోగదారులు కంటి కదలికలతో ఐప్యాడ్‌లు, ఐఫోన్‌లను నియంత్రించొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్