ఎలుకల బెడదను పోగొట్టుకోండిలా

50చూసినవారు
ఎలుకల బెడదను పోగొట్టుకోండిలా
ఇంట్లో ఎలుకలు ఉంటే చాలా మందికి కంగారుగా ఉంటుంది. ఖరీదైన దుస్తులు కొరికేస్తాయనే భయం ఉంటుంది. కొన్ని చిట్కాలతో ఎలుకల సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఏదైనా వస్త్రంలో కారం పొడి లేదా లవంగాలు వేసి వాటిని ఇంటి మూలల్లో ఉంచాలి. వాటి నుంచి వచ్చే ఘాటైన వాసనకు ఎలుకలు పారిపోతాయి. గోడలు, ఇంటి మూలల వద్ద బేకింగ్ పౌడర్ చల్లినా ఫలితం ఉంటుంది. రసాయనాల స్థానంలో సహజసిద్ధమైన పదార్థాలతోనే ఎలుకల సమస్య తొలగించుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్