బీహార్‌లోని నలంద జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో కలుషిత నీరు తాగి ఒక బాలిక మృతి చెందగా, 9 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన 9 మంది బాలికలను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మృతిచెందిన బాలిక పాఠశాల విద్యార్థిని కాదని, పాఠశాలలోని తన స్నేహితురాలిని కలిసేందుకు వచ్చిందని అధికారులు చెబుతున్నారు.