కేరళలోని వయనాడ్ లో కొండచరియలు విరిగిపడటంతో నష్టపోయిన ప్రజల సహాయార్థం నిధుల సేకరణ కోసం తమిళనాడుకు చెందిన 13 ఏళ్ల బాలిక హరిణి శ్రీ వరుసగా మూడు గంటల పాటు భరతనాట్యం ప్రదర్శించింది. ఆమె తన పొదుపుతో సహా రూ. 15,000 ముఖ్యమంత్రి సహాయ నిధికి (CMDRF) విరాళంగా ఇచ్చింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బాలికను కలుసుకుని ఆశీర్వదించారు.