స్విమ్మర్ కుశాగ్రా రావత్‌కు స్వర్ణం

65చూసినవారు
స్విమ్మర్ కుశాగ్రా రావత్‌కు స్వర్ణం
భారత స్విమ్మర్ కుశాగ్రా రావత్ సత్తా చాటాడు. సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న సౌతాఫ్రికా ఆక్వాటిక్స్ మీట్‌లో భాగంగా ఫ్రీ స్టైల్ 1,500 మీటర్ల ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించాడు. ఈ టోర్నీలో భారత్‌కు ఇదే తొలి మెడల్. కుశాగ్రా రావత్ 15: 41.61 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని అగ్రస్థానంలో నిలిచాడు. ఇదే ఈవెంట్‌లో మరో ఇద్దరు భారత స్విమ్మర్లు అనురాగ్ సింగ్(16:22.75 సెకన్లు) 5వ స్థానంలో, కృష్ణ గడఖ్(16:56.71 సెకన్లు) 10వ స్థానాల్లో నిలిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్