2,000 ఏళ్ల క్రితం నాటి మహిళ అస్థిపంజరంపై బంగారం

554చూసినవారు
2,000 ఏళ్ల క్రితం నాటి మహిళ అస్థిపంజరంపై బంగారం
పురాతన రోమన్ నగరమైన పాంపీలోని పురావస్తు శాస్త్రవేత్తలు అగ్నిపర్వత విస్ఫోటనంలో మరో ఇద్దరి అవశేషాలను కనుగొన్నారు. సుమారు 2,000 సంవత్సరాల క్రితం వారు మరణించి ఉంటారని అంచనా. అయితే పడక గదిలో స్త్రీ, పురుషుడి అవశేషాలు ఉన్నాయని పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు. మహిళ అస్థిపంజరం మంచంపై పడి ఉందని, ఆమె చుట్టూ బంగారు, వెండి, కాంస్య నాణేలు, ఆభరణాలు ఉన్నాయని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్