జ్యోతిష్య, శకున శాస్త్రాల ప్రకారం ఓ వ్యక్తి జీవితంలో చేయి దురద వల్ల కూడా అదృష్టం, దురదృష్టం కలుగుతాయని పండితులు పేర్కొంటున్నారు. ఓ వ్యక్తికి తరచూ కుడి చేయి దురద పెడితే ఆర్థిక కష్టాలు వెంటాడుతాయట. అదే ఎడమ చేయి అయితే అదృష్టానికి సంకేతమట. ఆకస్మిక ధన లాభం కలిగి మంచి రోజులొస్తాయని చెబుతున్నారు. ఛాతీపై తరచూ దురద వస్తే పూర్వీకుల డబ్బు చేతికొస్తుందట. అలాగే కాళ్లలో దురద ఉంటే ప్రయాణాలు చేస్తారట.