గిగ్ , ప్లాట్‌ఫారమ్ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ-కామర్స్, సేవా రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చేలా ఓ పథకాన్ని సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో వారికి పెన్షన్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉంది.