BSNL తమ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా కస్టమర్లకు కొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ. 277 రీఛార్జ్‌తో ప్రవేశపెట్టిన ఈ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB వరకు డేటా వాడుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆఫర్ 16 జనవరి 2025 వరకు అందుబాటులో ఉంటుందని బీఎస్‌ఎన్‌ఎల్ ఓ ప్రకటనలో తెలిపింది.