ఐపీఎల్-14 సీజన్ చాంపియన్‌గా చెన్నై నిలిచిన విషయం తెలిసిందే. ఆ జట్టులో కెప్టెన్ ధోనీ పాత్ర మర్చిపోలేనిది. అయితే, ఈ సీజన్‌తో ఆయన కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారని అభిమానులు నిరాశలో ఉన్నారు. ఈ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు శుభవార్త. వచ్చే ఐపీఎల్ సీజన్‌లోనూ చెన్నై జట్టుకు ధోనీయే సారథ్యం వహించనున్నాడు. ఆయనను కొనసాగించే అంశంపై చెన్నై సూపర్‌కింగ్స్ ప్రాంచైజీ సంస్థ స్పష్టతనిచ్చింది. ఐపీఎల్ వేలంలో తాము అట్టిపెట్టుకునే తొలి వ్యక్తి ధోనీయే అని ప్రకటన చేసింది. కాగా, ఐపీఎల్-15లో మరో రెండు కొత్త జట్లు ప్రవేశించనున్నాయి. మొత్తం 10 జట్లతో తదుపరి టోర్నమెంట్ జరగనుంది.