కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు దీపావళి నాడు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో హుస్నాబాద్‌లోని 100 పడుకల ఆస్పత్రిని 250 పడకల ఆస్పత్రిగా మారుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రూ. 82.00 కోట్లను రేవంత్ సర్కార్ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నిధులు విడుదల చేస్తూ పరిపాలన అనుమతులు జారీ చేసింది.