TS: అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం, పలువురు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరై అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే చర్చించారు. మరో వైపు మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ హాలులో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఆర్వోఆర్-2024 డ్రాఫ్ట్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది.