తెలంగాణలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు, వాటి అనుబంధ ఆసుపత్రుల్లోని పరిస్థితులపై సందేహాలు తలెత్తుతున్నాయి. కోల్‌కతా ఘటనతో వైద్య విద్యార్థినుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. భద్రత ప్రశ్నార్థకంగా మారిందని.. పలు కళాశాలల యాజమాన్యాలు దారుణంగా వ్యవహరిస్తున్నాయని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. పేరుకే గొప్ప చదువు తప్ప అంతటా నిర్లక్ష్యమేనని చెబుతున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో స్టైపెండ్ అందుతున్నా సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయంటున్నారు.